హీరోయిన్ శ్రద్ధా దాస్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో తన అందచందాలతో ప్రేక్షకులను మత్తెక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ తన హవా నడిపించింది అనే చెప్పాలి. కానీ ఎక్కడో ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఈ హీరోయిన్ చేసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో శ్రద్ధాదాస్కి అవకాశాలు తగ్గాయి. దీంతో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కనుమరుగయిన శ్రద్దాదాస్ ఇక ఇప్పుడు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో జడ్జిగా అవతారమెత్తింది. ఈ క్రమంలోనే అటు ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ ఢీ షో లో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటూ ఉంది. అయితే ఇటీవలే విడుదలైన ఢీ షో ప్రోమో లో భాగంగా ఏకంగా శ్రద్దాదాస్ హగ్ కోసం అదే షోలో ఉన్న టీమ్ లీడర్స్ అందరూ కూడా  కొట్టుకున్నారు అని చెప్పాలి.


 ఇటీవల విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇక ప్రతివారం సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఢీ నిర్వాహకులు ఈ వారం కలర్ థిమ్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకే కలర్ లో  డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ శ్రద్ధాదాస్కి బాగా నచ్చుతుంది. ఈ క్రమంలోనే అతని దగ్గరికి పిలిపించుకుని ఏకంగా చెంప మీద కూడా పెట్టించుకుంటుంది శ్రద్ధాదాస్. ఆ తర్వాత హైపర్ ఆది ని తన దగ్గరికి పిలుస్తుంది. కిస్ ఇవ్వను కానీ హగ్ ఇస్తాను అంటూ చెబుతోంది శ్రద్ధాదాస్. అలా చెప్పడంతో ఇక రవి కృష్ణ కూడా శ్రద్ధాదాస్ హగ్ కోసం హైపర్ ఆది తో పోటీపడుతూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: