రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే క్రేజ్ ను, అంతకుమించిన మార్కెట్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో , రాధే శ్యామ్ వంటి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస క్రేజీ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ క్రేజీ మూవీ లలో ఆది పురుష్ సినిమా ఒకటి.  ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా, కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం ఎలాంటి అధికారిక అప్డేట్ లను విడుదల చేయలేదు.

దానితో ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పురుష్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆది పురుష్ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: