మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితమే ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలను అందు కోలేక పోయింది . దానితో చివరగా ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది.  ఇలా ఆచార్య మూవీ తో తన అభి మానులను , మామూలు సినీ ప్రేమికులను నిరుత్సాహ పరిచిన మెగాస్టార్ చిరంజీవి మరి కొన్ని రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు . గాడ్ ఫాదర్ మూవీ మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రిమేక్ గా తెరకెక్కుతోంది .

గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా , సల్మాన్ ఖాన్ ,  సత్యదేవ్ , పూరి జగన్నాథ్ ,  నయనతార  ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. నయనతారమూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి  'గాడ్ ఫాదర్' మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఉండడంతో ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 22 వ తేదీన మెగాస్టార్ సీజరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: