తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పర చుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా మల్లాడి వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార అనే మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించారు .  ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది .

ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 15.50 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . అలా భారీ బిజినెస్ జరుపు కున్న బింబిసార మూవీ 16.20 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది . ఇప్పటి వరకు 12 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసు కున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా 32.43 కోట్ల షేర్ , 53.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిం ది. దీనితో బింబిసార మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 16.23 కోట్ల లాభాలను అందుకుంది . ఇలా ఈ మూవీ జరుపు కున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే డబల్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: