ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలేవి కూడా ఇంకా మొదలు కాకపోవడం ప్రేక్షకు లను ఎంతగానో నిరాశ పరుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన మొదలు పెట్టాల్సిన సినిమా ఎప్పుడో అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అది మొదలు కాకపోవడం అభిమానులలో రోజురోజుకు ఆగ్రహజ్వాలలను పెరిగేలా చేస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన క్రమంలో దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిన క్రమంలో ఇప్పుడు చేయబోయే సినిమాపై అభిమానులలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి..

అందుకే ఆయన సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు గా పరిస్థితి ఏర్పడింది. కొరటాల శివ చేసిన గత సినిమా ఆచార్య ఫ్లాప్ అవడంతో పూర్తిగా ఆయన డీలా పడిపోయారు. ఆర్థిక భారాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. ఈ నేపథ్యం లో  ఈ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తూ ఉండగా అభిమానులు మాత్రం ఈ సమయంలో ఆయనతో సినిమా చేయడం అవసరమా అని చెబుతున్నారు. 

రచయితగా మంచి పట్టు ఉన్న కొరటాల శివ దర్శకుడిగా భారీ స్థాయిలో విజయాలను అందుకున్నారు. మరి ఈ సినిమాను భారీ స్థాయిలో చేసి మంచి విజయాన్ని అందుకుంటాడా కొరటాల శివ అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సిని మా  చేస్తున్న విషయం తెలిసిందే. కే జి ఎఫ్ సినిమా తర్వాత సలార్ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రశాంత నీల్ వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ ఉండడం తెలుగు అభిమానులను ఎంతగా నో సంతోష పెడుతుంది. అలా సలార్ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన మరింత సమయా న్ని తీసుకోవడానికి అవుతుం ది అని కొంతమంది చెబుతున్నారు. ఇది ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో బాధపెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: