సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే . ఇప్పటికే ఈ సంవత్సరం బాక్సా ఫీస్ దగ్గర సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు తన తదుపరి మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో చేయబోతున్న విషయం  మనకు తెలిసిందే . కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ను ఆగస్ట్ నెలలో ప్రారంభించను న్నట్లు , అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఆగస్ట్ 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించే విధంగా మూవీ యూనిట్ ప్రణాళికలను వేసుకొంది. కాక పోతే కార్మికుల బంద్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ 9 వ తేదీన ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు సాయంత్రం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేస్తుందో చూడాలి. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: