ముఖ్యంగా ఈ చిత్రంలో గ్రాండ్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా మలిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.ఇక షూటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. అంతే కాదు ఇక్కడ ఒక సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు మరియు విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు కథలో ప్రధాన మలుపులను తీసుకువస్తాయని సమాచారం. వీరిద్దరి మధ్య ఉండే యాక్షన్, ఎమోషనల్ డైనమిక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర యూనిట్ విశ్వసిస్తోంది.
సంగీత పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉండనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం కథా నేపథ్యానికి మరింత బలం చేకూర్చేలా, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడుతోంది.నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయలు భుజాన వేసుకున్నారు. భారీ బడ్జెట్‌తో, ఎలాంటి రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి అంశంలోనూ అత్యుత్తమ నాణ్యతను అందించాలనే లక్ష్యంతో టీమ్ మొత్తం కష్టపడుతోంది.
మొత్తానికి “వారణాసి” సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం, శక్తివంతమైన కథా నేపథ్యం అన్ని కలిసొచ్చి ఈ సినిమా నిజంగా ఒక గ్లోబల్ ఫెనామెనాన్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి