ఢిల్లీకి చెందిన పవన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఒక ప్లాన్ వేసి స్నేహితుడి దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకిని తీసుకొని మరి, రొమ్ముకు గురి పెట్టుకొని చాలా స్టైల్ గా వీడియో తీయాలనుకున్నారు. స్నేహితుడు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్న సమయంలో గన్ ఎలా లోడ్ చేయాలో బటన్ ఎలా నొక్కాలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా కనిపిస్తోంది. తుపాకీ ఛాతికి ఆనించి వింత వింత ఫోజులు ఇస్తూ కెమెరా వైపు చూస్తున్న పవన్ నవ్వుతూ కనిపించారు. రికార్డు చేస్తున్న మిత్రుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టుకొని కాల్చుద్దు అన్నా అని హెచ్చరించారు.
అంతలోనే పవన్ తన అత్యుత్సాహంతో కంగారు పడి చేతి వేలు తెలియకుండానే ట్రిగ్గర్ మీదికి వెళ్ళగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దంతో అక్కడికక్కడే పడిపోయారు. అంతసేపు నవ్వుతూ కనిపించిన పవన్ రక్తం మడుగులో కెమెరా ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం పైన పోలీసులు విచారణ చేపట్టగా పవన్ స్నేహితుడు వద్ద ఉన్నది లైసెన్స్ తుపాకీ నేనని, ఆయుధంతో ఆడుకుంటూ వీడియోలు తీయడం చాలా విచారకరణం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. కేవలం లైక్స్ వ్యూస్ కోసమే ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ సాహసాలు చేస్తున్నారని, ప్రాణాలు పోయిన తర్వాత ఏ రీల్ కూడా దాన్ని తిరిగి తీసుకురాలేదని గుర్తించాలని తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి