మంగళవారం రాత్రి ఆయన ఈ సినిమా చూశానని , కొత్త సినిమా శకానికి నాంది పలికింది అంటూ తెలియజేశారు. ఈ సినిమా షోలే, మొఘల్ ఎ ఆజం వంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలగా కనిపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలియజేశారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో ఆడియన్స్ ను సరికొత్తగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందంటూ తెలియజేశారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ ను పొగడ్తలతో మంచేశారు. ఇకమీద డైరెక్టర్ అనే పదానికి ఆయన పేరుతోనే మొదలవుతుందని ప్రశంసలు కురిపించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం తాము చేస్తున్న పనులన్నీ వదిలేసి దురంధర్ 2 సినిమా చూడాలని సూచించారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా తెలుగు వర్షన్ కు సంబంధించి ప్రీమియర్ షోలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయనే విధంగా వినిపిస్తున్నాయి. కంటెంట్ డెలివరీలో ఆలస్యం అవ్వడం చేత తెలుగు, తమిళ వర్షన్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయని సిని వర్గాలలో వినికిడి. కేవలం హిందీ వర్షన్ షోలు మాత్రమే ప్రదర్శించబడతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన దురంధర్ 2 టెక్నికల్ సమస్యల వల్ల విడుదల ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి