శ్రీకాంత్ రెడ్డి , సంచితా బాషు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలుస్తుంది. ఈ మూవీ కి జాతి రత్నాలు మూవీ దర్శకుడు అయినటు వంటి అనుదీప్ కే వి కథ , స్క్రీన్ ప్లే , డైలాగ్ లను అందించగా వంశీధర్ గౌడ్ , లక్ష్మీనారాయణ పి ఈ మూవీ కి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ నేపథ్యం అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లను హీరో సంపాదించడం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని చిత్త బృందం ట్రైలర్ లో క్లుప్తంగా వివరించింది. 

అలాగే ఈ మూవీ ట్రైలర్ లో కామెడీ కూడా అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కు సంబంధించిన ప్రకటనను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఆగస్టు 31 వ తేదీన పార్క్ హయత్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు కూడా చిత్ర బంధం ప్రకటిస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: