వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటివరకు తెలుగులో దిగ్విజయంగా 5 సీజన్లను పూర్తిచేసుకుంది. ఇప్పుడు ఆరవ సీజన్ కోసం ముస్తాబయింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఈ ఆరవ సీజన్ తో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైందని చెప్పవచ్చు. ఇక ఈసారి కూడా సీజన్ సిక్స్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా గత మూడు సీజన్లతో పాటు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ బిగ్ బాస్ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త సీజన్లో కూడా ఆయనే సందడి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా నెట్టింట బాగా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం .

ఇకపోతే బిగ్ బాస్ 6 హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్ గా రాబోతున్నారు అని లిస్టు కూడా ఫైనల్ అయింది. అలాగే హౌస్ లోకి వెళ్లే వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు గ్రాండ్గా ఎంట్రీ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింపును కూడా విడుదల చేసి మరింత వినోదాన్ని పంచే  ప్రయత్నం చేసింది బిగ్ బాస్.. జీవితంలో ఏ మూమెంట్ అయినా సరే బిగ్ బాస్ తర్వాతే.. అంటూ నాగార్జున చెప్పడంతోనే ఈ ఫస్ట్ గ్లింప్ మొదలవుతుంది. ఇక ఈ వీడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ అప్ ను కూడా చూపించడం జరిగింది. ఇక అలాగే లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన విజువల్స్ తో పాటు అస్పష్టంగా కొంతమంది కంటెస్టెంట్లను ఇందులో మనం చూడవచ్చు.

అంతేకాదు ఇందులో కమలహాసన్ విక్రమ్ మూవీ డైలాగులను కూడా ఉపయోగించారు. ఇక ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన ఈ గ్లింప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తెలుగులో బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.



.

మరింత సమాచారం తెలుసుకోండి: