యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక హీరోగా నటించాడు . ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించ బోతున్నాడు .

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కంటే మించి తొమ్మిది భాషలలో విడుదల చేయాలని మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా తొమ్మిది భాషల్లో మూవీ ని విడుదల చేయాలి అని మూవీ యూనిట్ డిసైడ్ కావడంతో ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మరింత పక్కాగా ఉండే విధంగా కొరటాల శివ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అందు కోసమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ లో స్లిమ్ గా కనబడడం కోసం కాస్త బరువు తగ్గే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: