టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే నాగ చైతన్య , పరుశురామ్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. కాక పోతే పరుశురామ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం రావడంతో నాగ చైతన్య , పరశురామ్ కాంబినేషన్ మూవీ ఆగి పోయింది.

ఇది ఇలా ఉంటే పరుశురామ్ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ ని పూర్తి చేయడంతో మళ్లీ తిరిగి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తేరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అయినటువంటి శింబు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య కు మరియు శింబు కు , పరశురామ్ ఒక కథను వినిపించగా వీరిద్దరు కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అలాగే ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు కూడా ఒక వార్త నట్టింట చెక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తేరకెక్కబోయే ఒక మూవీ లో నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: