గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ప్రచార చిత్రాలను ఒక దాని తర్వాత ఒక దానిని విడుదల చేస్తూ వస్తున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పాటలను ,  కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'అలనై నీకై' అనే పల్లవి తో సాగే లిరికల్ సాంగ్ ని తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మెలోడియస్ గా సాగె ఈ పాట ని అంతారా నాండీ అద్భుతంగా ఆలపించగా ,  ఏ ఆర్ రహమాన్ బ్యూటిఫుల్ సాంగ్ కి ట్యూన్ ని అందించగా ,  అనంత శ్రీరామ్ అలరించే లిరిక్స్ ని ఈ సాంగ్ కి అందించారు.

ప్రముఖ సంస్థలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో చియన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష , శోభిత ధూళిపాల ,  ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పై తమిళ ఇండస్ట్రీ తో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: