కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్ వరస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.  శివ కార్తికేయన్ వరుసగా డాక్టర్ మరియు డాన్ మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రెండు మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయగా , ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ ప్రస్తుతం జాతి రత్నాలు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి దర్శకుడు గా పేరును సంపాదించుకున్న అనుదీప్ కే వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

మూవీ ని ఈ సంవత్సరం దీవాలి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ ఒక సాంగ్ ని విడుదల చేయక దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించండి. తాజాగా ప్రిన్స్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.  ఈ మూవీ నుండి జెస్సిక అనే సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.  ఈ మూవీ కి  ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: