టాలీవుడ్ లో యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చు కున్న నిఖిల్ ఇటీవల 'కార్తికేయ2′ సినిమా తో భారీ విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి హిట్ అయింది.
దీంతో తన సినిమాల కు బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడింద ని భావిస్తున్న నిఖిల్.. అక్కడ తన మార్కెట్ పరిధి ని పెంచు కోవాలనుకుంటున్నారు. నిఖిల్ ఇది వరకు '18 పేజెస్' అనే సినిమా లో నటించారు. ఆ సినిమా ను అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయా లని నిర్మాతలు ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు ఆ సినిమా ను రీషూట్ చేయాల ని నిఖిల్ అడగడం తో.. బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఆ సినిమా లో కొన్ని సీన్లు, ఫైట్స్ పెట్టబోతున్నారు. అలానే నిఖిల్ 'స్పై' అనే మరో సినిమా ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇప్పుడు ఈ సినిమా ను కూడా చాలా వరకు రీషూట్ చేయ బోతున్నారట. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తన సినిమాల ను మార్చాలని భావిస్తున్నారు నిఖిల్.
కొత్తగా ఒప్పుకునే సినిమా లన్నీ కూడా భారీగా ఉండాలని కోరుకుంటున్నారు నిఖిల్. ఇప్పటికే తన రెమ్యునరేషన్ కూడా పెంచారు. 'కార్తికేయ2'తో వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిఖిల్. అయితే ఇప్పుడు '18 పేజెస్', 'స్పై' సినిమాల కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..? ఎంత వరకు కలెక్షన్స్ సాధిస్తాయి అనే దాన్ని బట్టి నిఖిల్ ఫ్యూచర్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతానికైతే దర్శక నిర్మాతలు నిఖిల్ అడుగు తున్నట్లుగా మార్పులు, చేర్పులు చేయ డానికి రెడీ అవుతున్నారు. ఇవి గనుక హిట్ అయితే నిఖిల్ టాప్ రేంజ్ కి చేరుకోవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: