అనుపమ పరమేశ్వరన్.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తన అందం అభినయంతో కుర్ర కారు మత్తు పోగొట్టింది.  సినిమా విజయపజయాలతో సంబంధం లేకుండా తన పాపులారిటీ మాత్రం అంతకంతకు పెంచుకుంటూ పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో స్టార్ హీరోలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక మంచి టాలెంట్ వున్న నటి కావడం గమనార్హం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. కానీ అనుపమ పరమేశ్వరన్ కు మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు.


 అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సాధించిన అనుపమ పరమేశ్వరన్..  ఆ తర్వాత మాత్రం అదే రీతిలో విజయం సాధించలేక పోయింది అని చెప్పాలి.  ఇక తాను చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ కావడంతో చివరికి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. మొన్నటికి మొన్న అందాల ఆరబోత చేయడానికి కూడా సిద్ధమై లిప్ లాక్ సన్నివేశాలు బెడ్రూం సన్నివేశాల్లో కూడా నటించిన ఎందుకో ఈ అమ్మడికి బ్రేక్ మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాతో యంగ్ హీరోలు అందరికి కన్ను కూడా అనుపమ పరమేశ్వరం పైనే పడింది అనేది తెలుస్తుంది.


 ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తే నిరీక్షణ తప్పదు అని అర్థం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇక యువ హీరోల సినిమా అవకాశాలకు ఓకే చెబుతోంది. తనకంటే జూనియర్స్ సరసన నటించి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది అనుపమ పరమేశ్వరన్. మొన్నటికి మొన్న రౌడీ బాయ్స్ తో కొత్త హీరోతో లిప్ లాక్ సన్నివేశాలు చేసిన అనుపమ ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ తో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక మరోసారి నిఖిల్ హీరోగా చేస్తున్న 18 పేజెస్ బటర్ ఫ్లై అనే మరో సినిమా చేస్తుంది. సిద్దు జొన్నలగడ్డ సరసన డిజె టిల్లు 2 సినిమాలో ఎంపికైంది. ఇలా యువ హీరోలు తప్ప అనుపమకు వేరే దిక్కు లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anu