యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిమూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభించింది .

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 మూవీ గా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి తొమ్మిది భాషలలో విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా ,  ఆ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా కొరటాల శివ , ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన స్టోరీ ఫైనల్ నేరేషన్ ఇచ్చినట్టు ,  ఆ కథ ఎన్టీఆర్ కి అంతగా నచ్చినట్లు ,  దానితో మరి కొన్ని రోజులు కొరటాల శివ ,c ఎన్టీఆర్ 30 వ సినిమా స్క్రిప్ట్ పై పని చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: