ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని 3డిలో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ఓం రౌత్. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను అయోధ్యలో విడుదల చేయడం జరిగింది. దీంతో కొంతమంది ఈ సినిమా పైన ట్రోల్ చేయడం జరిగింది. ఈ ట్రోల్ పై నిర్మాత దిల్ రాజు స్పందించారు. బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తితే జండుబాం పెట్టి ట్రోల్ చేశారని ఇప్పుడు కూడా అలాంటి ట్రోలింగే జరుగుతోందని. ప్రతి ఒక్కరు సినిమాని సినిమా లాగా చూడాలని.. జనవరి 12న ఆదిపురుష్ ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమైందని తెలియజేశారు.

ఆది పురష్ సినిమా 3d టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ ఫస్ట్ టైం 3డీలో ఆది పురుష్ టీజర్ ని చూడగానే చాలా చిన్నపిల్లాడిలా కనిపించాను. హైదరాబాదులో బిగ్ స్క్రీన్ పైన త్రీడీ టీజర్ ను చూశాను రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో 60 థియేటర్లలో ఈ త్రీడీ టీజర్ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. అభిమానుల కన్నా తనుకు ఎవరు ఎక్కువ కాదని  తెలియజేశారు ప్రభాస్.ఇక దిల్ రాజు మాట్లాడుతూ ఆది పురష్ టీజర్ ని నేను కూడా మొబైల్లో చూశాను..ఆ తర్వాత ఇంటికి వెళ్లి టీవీలో చూశాను ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది అప్పుడు బిగ్ స్క్రీన్ పై త్రీడీలో చూశానని ఇది ఇంకా అద్భుతంగా అనిపించింది అని తెలియజేశారు. బాహుబలి సినిమా చూసినప్పుడు ప్రభాస్ శివలింగాన్ని ఎత్తితే ఆ ప్లేస్లో జండుబాం పెట్టి చాలా ట్రోల్ చేశారు. ఆ సినిమాను నైట్ చూసి నేనే ప్రభాస్ ఫోన్ చేసి చెప్పా సూపర్ హిట్ ప్రభాస్ ఆది పురుష్ కూడా అలాంటి సినిమానే మొబైల్ లో చూసి ఈ సినిమాని ఎవరు అంచనా వేయలేం ఇవన్నీ పెద్ద స్క్రీన్ ల పైన థియేటర్లలో చూసినప్పుడే ఆ సినిమా అనుభూతి కలుగుతుందని దిల్ రాజు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: