సాధారణంగా మన తెలుగు ప్రేక్షకులకు పక్క ఇండస్ట్రీలోని వారు ఏ హీరో అయినా నటుడు అయినా నచ్చాలంటే చాలా కష్టం.. తమిళ్ హీరోల్లో రజనీకాంత్, కమల్ హాసన్ బాగా రాణించారు..అయితే ఆ తర్వాత సూర్య, కార్తీ మాత్రమే తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు.. ఇదిలావుంటే ఇక ఇప్పుడు మలయాళ హీరో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు.. ఆయనే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్..ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సీతా రామం.. 

ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.. అయితే ఈ సినిమా కంటే ముందు దుల్కర్ మహానటి సినిమాలో నటించాడు.. కానీ అప్పుడు అంత పేరు రాలేదు.. అయితే  ఇక ఇప్పుడు మాత్రం సీతా రామం సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకుల పూర్తి అభిమానం పొందాడు.కాగా  ఈ సినిమాలో ఈయన నటన చుసిన మన దర్శకులు, నిర్మాతలు దుల్కర్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఈయన డేట్స్ పట్టి సినిమా చేయాలని చూస్తున్నారు.ఇక  వారిలో సుక్కు బ్యాచ్ కూడా ఉందట.. సుకుమార్ శిష్యులు అంటే ఎలా ఉంటారో అందరికి తెలుసు..

వీరు సినిమా చేస్తే సూపర్ హిట్ అయినట్టే.. మరి తాజాగా సుకుమార్ శిష్యుల్లో ఒకరు దుల్కర్ కు సరిపోయే కథ రాశారట.. దీంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం ఈయనను ఒప్పించి డేట్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది అని తెలుస్తుంది.అయితే ఇక  దుల్కర్ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవాలని ట్రై చేస్తున్నారు.. ఇకపోతే ఈ క్రమంలోనే సుకుమార్ శిష్యుడు దుల్కర్ ను కలిసి కథ వినిపించాలని చూస్తున్నాడట.. సుకుమార్ కూడా శిష్యుడు కోసం దుల్కర్ ను ఒప్పించేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.అయితే  సుకుమార్ శిష్యుడు అంటే దుల్కర్ కూడా ఆలోచించే అవకాశం ఉంది.. చూడాలి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: