కొన్ని రోజుల క్రితం విడుదల అయిన కన్నడ సినిమా కాంతార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంతార సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. 

మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. రిషబ్ శెట్టి ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి ఈ మూవీ లో ఇతర కీలక పాత్రలో నటించారు. కె జి యఫ్ రెండు భాగాలతో దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మూవీ ని నిర్మించారు. ఇలా ఇప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం తాజాగా చేసింది. ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన తెలుగు లో థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ని కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: