టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో
సక్సెస్ ఉన్న వారికి ఇచ్చే వ్యాల్యూ వేరే. ముఖ్యంగా హీరోయిన్లకు
సినిమా అవకా శాలు రావాలన్నా వారు ప్రతి సినిమాతో
సక్సెస్ కొట్టాల్సిందే లేదంటే వారికి
సినిమా అవకాశాలు తగ్గుతూ వస్తాయి ఆ విధంగా తాజాగా
సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావడానికి రెడీ గా ఉన్న కొత్త మంది హీరోయిన్లకు ఇప్పుడు కొత్త దిగులు మొదలయింది. అదే వారు నటిస్తున్న వరుస సినిమాలు దారుణమైన ఫ్లాపులు అవడమే. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎం తగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాప్ సినిమాలను అందిస్తూ ఉండడం ఆమె అభిమానులను నిరుత్సాహపరుస్తుంది.
దాంతో పాటు నిర్మాతలు కూడా ఆమెకు
సినిమా అవకాశాలు ఇవ్వడానికి కాస్త వెనకాడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆమె చేతుల్లో ఇప్పుడు మోస్తారు బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. మరి ఈ సమయం లో ఆమె ఏవిధంగా
సక్సెస్ బాట కి ఎక్కుతు చూడాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగు
సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ
కేతిక శర్మ కూడా ఇప్పుడు వరుస ప్లాపులను అందుకోవడం ఆమెను మరింత కలవర పెడుతుంది. తొలి సినిమాతో మంచి
సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తీసిన రెండు సినిమాలతోనూ భారీ స్థాయిలో ఫ్లాప్ లను ఖాతాలో వేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ కం బ్యాక్ చేయాలి అంటే తప్పకుండా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె చేతులు ఇప్పుడు ఒక్క తెలుగు
సినిమా కూడా లేదనే చెప్పాలి. ఇక
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న
హీరోయిన్ నాభా నటేష్ కూడా ఇప్పుడు వలస ఫ్లాప్ లతో సతమతమవుతుంది. ఆమె ఇప్పుడు రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే తప్ప ఆమెకు ఏమాత్రం కలిసి రాదని చెప్పాలి.