మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  సునీల్ , అంజలిమూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో సెకండ్ హాఫ్ లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉండబోతున్నట్లు ,  ఆ క్యారెక్టర్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ,  ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. దర్శకుడు శంకర్మూవీ ని తన పూర్వపు సినిమాల మాదిరి గానే అద్భుతమైన గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: