కార్తి డ్యూయల్ రోల్‌లో నటించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌కీ, బోస్ అలియాస్ సర్దార్ కేరక్టర్‌కీ చక్కగా న్యాయం చేశారు. గెటప్పుల నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని చేశారు. డైరక్టర్ మిత్రన్ ల మీద కోలీవుడ్‌లో ఓ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఈ తో మరోసారి తనమీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు డైరక్టర్. ఏదో స్పై చేశామంటే చేశామన్నట్టు తీయకుండా, జనాన్ని ఆలోచింపజేసే నీళ్ల గురించి అందంగా కథ అల్లుకున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ఇబ్బంది, తాగే నీటిని జాతీయ స్థాయిలో కమర్షియలైజ్ చేస్తే కలిగే అనర్థాలు వంటివాటిని చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగులో రాకేందు రాసిన డైలాగులు బావున్నాయి. తన తల్లి చనిపోయిన తర్వాత విజయ్‌తో కూర్చుని టిమ్మీ మాట్లాడే మాటలు ఎలాంటివారినైనా కదిలిస్తాయి. నటీనటులందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ కూడా బావుంది. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల హైలైట్ అనిపిస్తుంది. పాటలు సోసోగా ఉన్నాయి. ఫైట్లు భారీగా ఉన్నాయి.
లాయర్ కేరక్టర్‌లో రాశీఖన్నా, సోషల్ యాక్టివిస్ట్ గా లైలా, బోస్ భార్యగా రజీషా విజయన్ మెప్పించారు.
మిలిటరీలో పనిచేసే వారికి ఇళ్లల్లో ఉండే గౌరవం, ఏజెంట్లకు దక్కని గౌరవం గురించి కూడా సున్నితంగా చర్చించారు లో.
సీక్వెల్స్ హవా నడుస్తున్న ఈ హయాంలో సర్దార్ కి కూడా సీక్వెల్ ఉందనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు మిత్రన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి