తమిళ స్టార్ హీరో ధనుష్ హీరో వా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి చే స్తున్న సార్ చిత్రం డిసెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  ప్రేక్షకులందరి ముందుకు ఎంతో గ్రాండ్ గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరి నీ ఆశ్చర్యపరుస్తుంది అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న ధనుష్ ఈ చిత్రం ద్వారా మరొకసారి  అభిమానులను అల రించబోతున్నాడట.  ఈ నేపథ్యంలో ఈ సినిమా తరువాత మరొక తెలుగు దర్శకుడు తో సినిమా ఓకే చేసుకున్న ఆ చిత్రాన్ని చేస్తాడా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి.

వాస్తవానికి సార్ చిత్రాని కంటే ముందుగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధ నుష్ సినిమా ఒప్పుకున్నారు కానీ స్క్రిప్టు విషయంలో కాస్త ఆలస్యం జరగడం తో ఈ సినిమాను పక్కన పెట్టి వెంకీ అట్లురి దర్శకత్వం లోని సినిమాను మొదలుపెట్టాడు. అయితే ఇప్పు డు ఆ సినిమా పూర్తి కావడంతో శేఖర్ తో ఆయన సినిమా చేస్తాడు అనే ది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది. క్లాసికల్ సినిమాలను చేయడంలో ఈ దర్శకుడు కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి దాకా ఆయన చేసిన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు. 

స్టార్ హీరోలను ఎక్కువగా డైరెక్ట్ చేయని ఈ హీరో తొలిసారిగా ధనుష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూ ఉండడం అది ఏవిధంగా ఉంటుందో అన్న ఆసక్తిని కలిగిస్తుంది. తొందరలోనే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాపై ఓ క్లారిటీ రాబోతుంది అని అంటున్నారు. ఇక తమిళంలో చాలామంది దర్శకులతో కలిసి ధనుష్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే రెండు మూడు సినిమాలు తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు డిసెంబర్లో సార్ చిత్రాన్ని విడుదల చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

sir