మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు అన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ధమాకా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు మూడు సాంగ్ లను విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లతో పాటు రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. అలాగే చిరంజీవి హీరోగా తేరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక సినిమాకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస కమిట్ మెంట్ లతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

జాంబీ రెడ్డి మూవీ తో మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ప్రశాంత్ వర్మ కు రవితేజ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ , రవితేజ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన రవితేజ , ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన నిలబడలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: