ఈ మధ్య కాలంలో భాషతో ఏ మాత్రం సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇతర భాషలలో కూడా డబ్ అయి సూపర్ హిట్ విజయాలను సాధిస్తున్నాయి. దానితో చాలా మంది నిర్మాతలు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమా లను డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తమిళ భాషలలో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లవ్ టుడే సినిమాను కూడా తెలుగు భాషలో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.

లవ్ టుడే సినిమా తమిళ భాషలో నవంబర్ 4 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లవ్ టుడే మూవీ కి 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్ల షేర్ కలక్షన్ లను సాధించినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: