రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో , అంతకుమించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా మరో కొత్త దర్శకుడు తో మూవీ ని ఓకే చేసినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తమిళ సినిమా విక్రమ్ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రభాస్ ఒక మూవీ లో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ మరియు లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన బ్యానర్ లలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించ బోతున్నట్లు ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ప్రభాస్ మరియు లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని , సలార్ , ప్రాజెక్ట్ కే , మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజు ప్రస్తుతం దళపతి విజయ్ 67 వ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: