మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికీ ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రాలలోనూ , ఇతర ముఖ్య పాత్రాల లోనూ నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అలాగే పోయిన సంవత్సరం సమంత "పుష్ప" మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించి తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ ఐటెం సాంగ్ తో సమంత కు పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే పాన్ ఇండియా మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కిన యశోద మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు.

మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సొంతం చేసుకున్న ఈ మూవీ ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 9 వ తేదీ నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ ని ఈ రోజు నుండి స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: