తెలుగులో, ఇంగ్లిష్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఇక్కడ డబ్ అయ్యి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను అందుకున్నాయి.. అలాంటి సినిమాల లో ఒకటి అవతార్..విజువల్ వండర్ గా జేమ్స్ కామరూన్ ఆ సినిమాను చిత్రీకరించారు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది..అయితే వారందిరి కోసం ఈ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 సినిమాను తెరకెక్కించారు.


సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది సినిమా. ఇదిలా ఉంటే అవతార్ 2 విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో లీక్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ చిత్రం కు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ డే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు.. అతని సాహసానికి హ్యట్సాప్ చెప్పాల్సిందే.. విజువల్స్ అదరహో అనిపించాయి అనడంలో సందేహం లేదు..


అత్యంత భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది. ఇక అవతార్ 2 మొదటి రోజు ఎంత వసూల్ చేసిందనే హాట్ టాపిక్ గా మారింది..ఫస్ట్ డే 3800కు పైగా స్క్రీన్స్లో 17000 షోస్ ప్రదర్శించబడింది. ఈ ఇండియా వ్యాప్తంగా మొత్తం ఆరు భాషల్లో విడుదలైంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది సినిమా. ఇక ఈ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.. 20 కోట్లు కలెక్ట్ చేసింది.


అయితే, తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ రాబట్టింది. మొదటిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా వైడ్గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 45 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు అవతార్ కలెక్షన్స్ కు డోకాలేదు అని తెలుస్తోంది..రేపు ఈ సినిమా కలెక్షన్స్ ను ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: