మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోయే వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మైత్రి మూవీ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జనవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... జనవరి 8 వ తేదీన ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ ట్రైలర్ విడుదల సమయాన్ని ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జనవరి 7 వ తేదీన సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: