ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య డేటింగులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇక తెలుగులో అయితే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ముందుగానే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెన్ గా మారిపోతున్నారు. దీంతో డేటింగ్లు మీటింగులు అనే రూమర్స్ వారిపై రావు అని చెప్పాలి. కానీ బాలీవుడ్ లో మాత్రం పెళ్లికి దూరంగా ఉంటూ డేటింగులతో బిజీగా ఉండే హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు.


 పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసి ఇక సహజీవనం చేయడానికి కూడా చాలా మంది వెనకడుగు వేయడం లేదు. ఇక ఇలాంటి వార్తలు ఎప్పుడూ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి తమ డేటింగ్ తో వార్తలు హాట్ టాపిక్ గా మారిపోయిన జంటల్లో అర్జున్ కపూర్, మలైక అరోరా జంట కూడా ఒకటి అని చెప్పాలి. అర్జున్ కపూర్ తనకంటే 13 ఏళ్ల పెద్దదైన మలైకా అరోరాతో డీప్ డేటింగ్ లో కొనసాగుతున్నాడు. పబ్లిక్ గానే ముద్దులు హగ్గులు ఇచ్చుకుంటూ రచ్చ చేస్తున్నారు ఈ జంట.


 ఇకపోతే ఇటీవల అర్జున్ కపూర్ నటించినా కుత్తే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఏకంగా అర్జున్ కపూర్ మలైకా ఆరోరాతో డేటింగ్ గురించి పచ్చిగా మాట్లాడిన తీరూతో అందరు షాక్ అయ్యారు. ఏకంగా మలైక అరోరాతో బెడ్ పంచుకోవడం విషయాన్నీ కూడా మాట్లాడాడు అర్జున్ కపూర్.  నేను మలైకాతో మంచి రిలేషన్ ఏర్పరచుకున్నాను.. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగోలు లేవు. ఒకరి పనులు ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆమెతో ఉంటే హ్యాపీగా ఉన్నాను అని ఫీలింగ్ నాలో ఉంటుంది. సుఖంగా పడుకుని హ్యాపీగా నిద్రపోతున్నానంటే అందుకు మలైకా అరోరా కారణం అంటూ అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇలా బెడ్ రూమ్ విషయాలు కూడా పచ్చిగా మాట్లాడటం పై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: