ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చినా బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ లో అదేవిధంగా మాటల తీరులో చాల మార్పు వస్తుంది. ఈమార్పు వల్లనే అనుకోకుండా బాలకృష్ణ వివాదాలలో చిక్కుకుంటాడు. రెండు రోజుల క్రితం ‘వీరసింహా రెడ్డి’ మూవీ సక్సస్ మీట్ లో మంచి జోష్ లో ఉన్న బాలయ్య మాటల ఫ్లోలో అన్న ఒక పదం పై అక్కినేని అభిమానులు విపరీతంగా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.


‘వీరసింహా రెడ్డి’ సక్సస్ తో జోష్ లో ఉన్న బాలయ్య ఈమూవీ షూటింగ్ గురించి మాట్లాడుతూ తాము షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తామంతా చాల సరదాగా ఒక పిక్నిక్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా షూట్ చేసాము కాబట్టి తామంతా ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా తమకు శ్రమ అనిపించలేదు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈసినిమా షూటింగ్ స్పాట్ లో తాము అంతా ‘వేదాలు శాస్త్రాలు నాన్నగారి డైలాగ్ లు ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని’ విషయాలు ఎన్నో మాట్లాడుకుంటూ సరదాగా షూటింగ్ ను ఎంజాయ్ చేసామని అంటూ చేసిన కామెంట్స్ క్షణాలలో వైరల్ గా మారి మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.


వాస్తవానికి ఈ కామెంట్స్ బాలయ్య యధాలాపంగా చేసినట్లు అని అనిపిస్తున్నప్పటికీ ఆ కామెంట్స్ బాలయ్య నోటివెంట అక్కినేని వర్థంతి రోజున రావడం యాధృశ్చికమే అయినప్పటికీ ఆ కామెంట్స్ అక్కినేని ఫ్యాన్స్ కు తీవ్ర అసహనాన్ని కల్గించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  


గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ నాగార్జున్ ల మధ్య గ్యాప్ కొనసాగుతోంది అన్నవార్తల హడావిడి జరుగుతోంది. ‘అన్ ష్టాపబుల్’ షోకు అనేకమంది టాప్ హీరోలు వస్తున్నప్పటికీ ఆషోకు అతిధిగా నాగార్జున రాకపోవడం వెనుక ఈ గ్యాప్ కారణమా అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేనిలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వాస్తవాలను విస్మరించి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ ఎందుకు కామెంట్స్ చేసాడు అంటూ అక్కినేని అభిమానులు అసహనంలో ఉన్నట్లు టాక్..  
మరింత సమాచారం తెలుసుకోండి: