ఇప్పటి వరకు కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహష్ బాబు తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.

మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ తప్ప మిగతా ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు రాకపోయినప్పటికీ ఈ మూవీ పై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రారంభానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ని జూన్.లో లాంచింగ్ చేయాలి అనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తాజాగా వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ఈ చిత్ర బృందం ప్రకటించింది. మరి ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత మహేష్ ... రాజమౌళి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని తెలుస్తుంది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: