యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను పెట్టకపోవడంతో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ జరుపుతోంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం రాత్రి వేళ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది ఇలా ఉంటే రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... సన్సేషనల్  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.

అలాగే ఈ మూవీ కి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేయనున్నారు. అలాగే ఈ మూవీ లో అత్యంత భారీ క్రేజ్ ఉన్న నటీనటులు నటించబోతున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర కోసం ఈ మూవీ యూనిట్ సైఫ్ అలీ ఖాన్ ను సంప్రదించగా ఆ ఆఫర్ ను ఈ నటుడు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: