తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉండే విశ్వక్ తన కెరీర్ లో ఎన్నో మూవీ లలో నటించి అందులో  కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో నివేత పేత్ రాజ్ ... విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలను నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 14 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. థియేటర్ లలో మంచి విజయం అందుకున్న ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఏప్రిల్ 14 వ తేదీ నుండి ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: