యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో కీరవాణి అందించిన సంగీతం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... భూమిక ... అంకితమూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు. 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ తో రాజమౌళి మరియు ఎన్టీఆర్ ల క్రేజ్ కూడా విపరీతంగా పెరిగి పోయింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను థియేటర్ లలో 4కే వర్షన్ తో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా సింహాద్రి మూవీ యూనిట్ ఈ సినిమా ను 4 కే వర్షన్ తో ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మూవీ ని మే 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో 4 కే వర్షన్ తో డోల్బీ సౌండ్ సిస్టంతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటున్నాయి. మరి సింహాద్రి మూవీ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: