సమంతతో విడిపోయిన తరువాత మీడియా సమావేశాలకు దూరంగా ఉన్న చైతన్య తన పద్దతిని మార్చుకుని మీడియా సమావేశాలలో చాల యాక్టివ్ గా పాల్గొనడమే కాకుండా మీడియా వర్గాలు అడిగిన అనేక ప్రశ్నలకు చైతూ నవ్వుతూ చాల సమయస్పూర్తితో సమాధానాలు ఇవ్వడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఈమీడియా సమావేశంలో పాల్గొన్న కొందరు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ఘోర పరాజయం గురించి ప్రస్తావించినప్పుడు నాగచైతన్య ఆవిషయమై చాల వ్యూహాత్మకంగా స్పందించాడు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత జయాపజయాలు ఎవరికైనా వస్తూనే ఉంటాయని వాటి గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేసుకునే కంటే రానున్న కాలంలో మరింతగా ఎలా ఎదగాలి అన్న ఆలోచనచేయడం తమ అక్కినేని కుటుంబ వారసత్వంలో ఉంది అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు సినిమా పరాజయం తరువాత మరింతగా పట్టుదల పెరగాలని అప్పుడే ఏ నటుడైనా తన కెరియర్ లో రాణిస్తాడు అన్న విషయాన్ని తెలియచేసాడు. ఇదే సందర్భంలో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన తండ్రి నాగార్జున అఖిల్ తో కలిసి నటించడానికి మంచి కథ దొరికితే తాను ఎప్పుడు రెడీ అంటు సంకేతాలు ఇచ్చాడు.
అంతేకాదు తమ ఇంటిలో ఎప్పుడు సినిమా విషయాలు మాట్లాడుకోమనీ రకరకాల ఫుడ్స్ గురించి అలాగే చూడవలసిన అందమైన టూరిస్ట్ స్పాట్స్ గురించి అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటాము కాని తాము నటించే సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోమనీ అంటూ ఇంట్లో కూడ సినిమా విషయాలు ఏమిటి అంటూ తన తండ్రి ఆవిషయాల పై పెద్దగా ఆశక్తి కనపరచడు అన్న కామెంట్స్ చేసాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి