ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయి. కాకపోతే రెండు మోస్ట్ క్రేజీ సినిమాలు ఈ రోజు నుండి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో ఆ సినిమాలు ఏవో ... అవి ఏ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

2018 : ఈ మూవీ మొదట మలయాళ భాషలో విడుదల భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇలా అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఈ రోజు నుండి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ వర్షన్ లను ఈ రోజు నుండి సోనీ లీవ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

అవతార్ ది వే ఆఫ్ వాటర్ : జేమ్స్ కామరొన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇంతటి భారీ విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజు నుండి హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఈ రోజు నుండి హాట్ స్టార్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇంగ్లీష్ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: