రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ దర్శకుడు దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా భారీ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 242 కోట్ల భారీ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ భార్యలోకి దిగింది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని ... భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కుతూ వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 190.65 కోట్ల షేర్ ... 386.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. దీనితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 51.35 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో నటించగా కృతి సనన్మూవీ లో సీత పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: