హాలీవుడ్ లెజెండరీ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంఛైజీ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ 7' (డెడ్ రికనింగ్ పార్ట్ 1) థియేట్లలోకి విడుదలై దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచ దేశాలు సహా భారతదేశం లో కూడా అత్యంత భారీ గా ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా భారీ స్థాయి లో విడుదల కాగా దీని పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాకి అభిమానుల నుంచి అద్భుత స్పందనలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు విజిల్స్ పడుతున్నాయంటే ఇందు లో విజువల్ ట్రీట్ ఏ రేంజు లో ఉందో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. విడుదల అయిన రోజు నుంచే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ అవేంజర్స్ ఎండ్ గేమ్ మూవీకి పోటీగా నిలుస్తుంది.ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే టామ్ క్రూజ్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయనే ఈ సినిమాకి హైలెట్.61 ఏళ్ల వయసు లో ఇంత అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటించడం అంటే అసాధారణమైన ఫీట్ అనడంలో సందేహం లేదు.


ఇందులో లెక్కకు మించి రిస్కీ స్టంట్స్ తో టామ్ గూస్ బంప్స్ తెప్పించాడు. ముఖ్యంగా ఈ సినిమా కి ఆయన ఎంపిక చేసుకున్న కథాంశం.. స్క్రీన్ ప్లే సహా ప్రతిదీ కూడా హైలైట్ గా నిలిచింది.ఏఐ ఆధారిత మిషన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సరికొత్త గూఢచారి సినిమా ఇది.ఇక క్లైమాక్స్ లో ట్రైన్ ఎపిసోడ్ ఇంకా పసుపు రంగు కార్ లో ఛేజింగ్ సీక్వెన్స్.. లోయ లోకి హీరో డెడ్లీ బైక్ జంప్ లకు సంబంధించి చిన్నపాటి గ్లింప్స్ ని రిలీజ్ ముందే మేకింగ్ వీడియోల్లో చూపించగా అది నెట్టింట వైరల్ ఐయింది. ఆ సీన్లన్ని సినిమాలో మైండ్ బ్లోయింగ్.. ఈ సినిమా ఈమధ్య కాలం లో వచ్చిన అద్భుత యాక్షన్ అడ్వెంచర్ స్పై సినిమా అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా వున్న టామ్ క్రూజ్ అభిమానులు థియేటర్లలో ఈ సినిమాని చూసాక ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా సాధారణ ప్రజలని కూడా థియేటర్లకు తీసుకురావడం గ్యారెంటీ అన్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: