విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తాజాగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ పాటలు ... ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ నిన్న విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఓపెనింగ్ లు కూడా లభించాయి. అలాగే ఈ సినిమాకు కూడా హిట్ టాక్ రావడంతో ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను నిర్వహించాలి అని ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి మూవీ మేకర్స్ ఈ ఆదివారం రోజు తిరుపతి లో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే వరుస అపజయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలపడిన విజయ్ కూడా ఈ సినిమాతో మంచి కం బ్యాక్ అయినట్లు తెలుస్తుంది. అలాగే సమంత కూడా శాకుంతలం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొని ఈ సినిమాతో తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: