కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్ 2'లో ఆదిత్య కరికాలన్‌గా తన అద్భుతమైన నటనతో  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్రయోగాత్మక చిత్రం 'తంగళన్' షూటింగ్‌ను కూడా ముగించాడు.ఆ తర్వాత చియాన్ ఏ కొత్త చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు..విక్రమ్ తన తరువాత సినిమా ఎలా ఉంటుందో  చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు విక్రమ్ అభిమానులకు స్వీట్ న్యూస్ అందింది. దర్శకుడు ఆర్.ఎస్.విమల్ మెగా ఎపిక్ 'సూర్యపుత్ర మహావీర్ కర్ణ' చిత్రీకరణ త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ టైటిల్ రోల్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లి కొన్ని యుద్ధ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ అప్పట్లో రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా చిత్రీకరణ ఆగిపోయింది.విక్రమ్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసాడని ప్రచారం కూడా జరిగింది.అయితే దర్శకుడు ఆర్.ఎస్ విమల్ తన ఫేస్‌బుక్‌లో 'సూర్యపుత్రన్ కర్ణన్ రోలింగ్ త్వరలో' అనే సందేశాన్ని విక్రమ్ స్టిల్‌తో పోస్ట్ చేసాడు. కర్ణ ఈ చిత్రంలో ఫుటేజ్ నుండి ఫోటోగ్రాఫ్ బయటికి రాగానే అంతటా ఆసక్తి ఏర్పడింది. 

ప్రొడక్షన్ హౌస్ మిగిలిన నటీనటులు- సిబ్బందికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.. మరోవైపు కర్ణకు సంబంధించిన తాజా వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ వీడియోని చూస్తుంటే  బాహుబలి ని మించి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని కర్ణ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. పొన్నియన్ సెల్వన్ క్లాసీ సినిమా. ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్లను మించి కథ కీలకంగా సాగుతుంది.. కానీ మహాభారతంలోని కర్ణుడి పాత్రతో భారీ వార్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. దీనితో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు... ఈ చిత్రం కోసం విక్రమ్ ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ అలాగే విజువల్ గ్రాఫిక్స్ షాట్స్ కానీ ఎంతో గ్రాండ్ గా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వరల్డ్ క్లాస్ వారియర్ సినిమాని తెరకెక్కించాలన్న ఉద్దేశం ఈ విజువల్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ ఎప్పుడో మొదలు పెట్టిన సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న డిలే ప్రాజెక్ట్ 'ధృవ నచ్చతిరమ్' సినిమాను నవంబర్ 20 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: