టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. ఇంట్లో హీరోయిన్గా శ్రీ లీల నటించింది ఈ రోజున పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లో విడుదల కావడం జరిగింది. స్కంద సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలు, ట్రైలర్ ,టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ ని మాస్ హీరోగా ఎలా చూడాలనుకున్నారో అలా ఈ చిత్రంలో చూపించినట్టుగా తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందించారు.



పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఇప్పటివరకు వచ్చిన రివ్యూల ప్రకారం రామ్ జోడీకి శ్రీ లీల అదిరిపోయిందని డాన్స్ పరంగా ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మంటలేనని తెలియజేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ సాంగ్స్ దుమ్ము దులిపేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఆఖరి 15 నుంచి 20 నిమిషాల పాటు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందంటూ రివ్యూలలో తెలియజేయడం జరుగుతోంది.శ్రీ లీల అందంతో పాటు అభినయం కూడా ఈ సినిమాకి ప్లస్ అయిందని పలువురు నెట్టిజెన్స్ తెలుపుతున్నారు.


మరొకసారి బోయపాటి శ్రీను తన మార్కుని యాక్షన్స్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు రామ్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో మాస్ హీరోగా ప్రేక్షకులకు కిక్కించే విధంగా కనిపిస్తున్నారని తెలుస్తోంది.. అఖండ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి నమ్మకం ఉన్నది. ఈ చిత్రంలోని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా అలరించే విధంగా ఉందంటూ తెలుపుతున్నారు భారీ బడ్జెట్ తో అత్యంత సాంకేతిక నిప్పునులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుపుతున్నారు. మరి పూర్తి రివ్యూ కావాలి అంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: