అయితే ఆమె ఎన్నో కథలు తీసుకుని నిర్మాతల చుట్టూ తిరిగింది. ఇది ఇప్పుడు కాదు, ఓ ఐదేళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అని దాట వేస్తుండే వారట. ఐదేళ్ల తర్వాత వస్తే, మళ్లీ అదే మాట చెప్పేవారట. కొందరు ఇలాంటివి ఎందుకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చేయాలని, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని చెబుతుండేవారట. తాము సినిమా చేయలేమని చెప్పలేక ఇలాంటి పదాలు వాడుతుండేవారని వాపోయింది దర్శకురాలు పూజ కొల్లూరు. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు రీమేక్‌ని ఎంచుకుంది. అయితే తాను అందరిలాంటి సినిమాలు చేయాలనుకోవడం లేదని, విజయ్ నిర్మల మాదిరిగా బలమైన కథలు చెప్పాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇక `మార్టిన్ లూథర్ కింగ్` గురించి చెబుతూ.. `మండేలా` చిత్రం చూసినప్పుడు ఇది తాను డైరెక్ట్ చేస్తే బాగుంటుందనిపించిదట. ఇలాంటికథలు చెప్పాలనిపించి తాను చేస్తానని వెంకటేష్ మహాకి చెప్పడంతో ఆయన(మహాయాన మోషన్ పిచ్చర్స్)తోపాటు వైనాట్ స్టూడియో, రిలయన్స్ ఎంటర్‌టైనర్ వారి ప్రొడక్షన్‌లో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఓటింగ్ ప్రయారిటీని చెబుతున్నారట. రాజకీయ నాయకుల కంటే ఓటర్ గొప్ప అని, ఓటింగ్‌పై సెటైరికల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పింది పూజ. అంతేకాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, ఎలక్షన్లని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందన్నారు.
టాలీవుడ్‌లో లింగభేదం గురించి చెబుతూ, మహిళా దర్శకులకు ఏ పరిశ్రమలోనైనా సమస్యలు ఉంటాయి. మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మహిళలకు కొంచెం అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కొందరు ఇవన్నీ ఎందుకు మీకు, రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. వాటిని దాటుకుని ముందుకు సాగాలని తెలిపింది. అదే సమయంలో లింగభేదం చాలా ఉంటుందని, సెట్‌లోనూ అది కనిపిస్తుందని, `మార్టిన్ లూథర్ కింగ్` షూటింగ్ టైమ్‌లో దాన్ని ఫేస్ చేసినట్టు చెప్పింది పూజ కొల్లూరు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి