తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అడవి శేషు హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలా నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులోనే తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ బ్యూటీ కి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ క్రేజీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: