
వాటిలో భాగంగానే యానిమల్ సినిమా ఇప్పుడు రాబోతోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 200 కోట్ల రూపాయల ఖర్చుతో యానిమల్ సినిమాలు తెరకెక్కించినట్లు సమాచారం. అంతేకాకుండా నిర్మాతలను ఒకరైన వారు డైరెక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.. సందీప్ రెడ్డి పైన నమ్మకం ఉండడంతోనే ఇంత బడ్జెట్ పెట్టి ఈ సినిమాని చేస్తున్నామని తెలియజేశారు.
ఇప్పటికీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా సగానికి పైగా పెట్టుబడి రికవరీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్ బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ తర్వాత ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయని ఈ నేపథ్యంలోని ఇప్పటివరకు ఓవర్సీస్ తో పాటు నార్త్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ లో దూసుకుపోతుందని తెలిపారు. ఇదే జోరు కొనసాగితే కచ్చితంగా మొదటి రోజే 100 కోట్లను క్రాస్ చేసే అవకాశం ఉందని పలువురు ట్రెండ్ పండితులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా రణబీర్ ర్ కెరీర్ ని మారుస్తుందో చూడాలి.