మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమా కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో "ఆర్ సి 16" అనే టైటిల్ తో ఈ మూవీ ని లాంచ్ చేశారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.

ఇకపోతే ఇప్పటికే బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చరణ్ కు అదిరిపోయే క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ కథ మొత్తం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది  ఈ మూవీ లో చాలా అదిరిపోయే సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే రెహమాన్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: