నటీనటులు: అనురాగ్, అవికా గోర్, పోసాని కృష్ణ మురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, త్రినాధ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు.
డైరెక్టర్:సత్య ద్వారపూడి.
నిర్మాత: కే కోటేశ్వరరావు.
మ్యూజిక్ డైరెక్టర్:శక్తి కాంత్ కార్తీక్.
ఎడిటింగ్: గౌతమ్, రాజు నాని.
పి ఆర్ ఓ: సాయి సతీష్, రాంబాబు.
ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాయి. అందులోనూ పల్లెటూరి ప్రేమ కథలకు మరింత ఆదరణ లభిస్తుంది. అలాంటి ఒక పల్లెటూరి ప్రేమ కథ ఈ ఉమాపతి అనే చిత్రం. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వరరావు నిర్మించగా సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు పాటలు టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ గంధమైన ప్రేమ కథ చిత్రం అని కొనియాడారు. ఇక ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
కధ : ఉమాపతి కధ దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్యలో జరుగుతుంది. వర( అనురాగ్) కొత్త పల్లి కి చెందిన వాడు. తండ్రి దుబాయ్ లో కష్టపడి సంపాదిస్తుంటే ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి గా కనిపిస్తాడు వర. అలాంటి వర పక్క ఊరైన దోసకాయ పల్లి లో ఉమా ( అవికా గోర్ ) ని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది పైగా ఉమా సోదరుడికి వర కి పాత గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెప్తాడు, అసలు వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారా, పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు, చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్ ఏమిటి అన్నది థియేటర్స్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్, నటీనటుల నటన సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ లో చక్కని వినోదాన్ని చూపించారు. ఇంటర్వెల్ కి ముందు ఇచ్చిన ట్విస్ట్ హైలెట్.
మైనస్ పాయింట్స్ : అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మనం ఇంతకుముందు ఎక్కడో చూసిన అనుభూతిని కనిపిస్తాయి, కొన్ని సన్నివేశాలు మరి సాగదీసినట్లుగా అనిపిస్తుంది
సాంకేతిక విభాగం: సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు ఆర్ఆర్ ప్లస్ అవుతాయి ఆహ్లాదకరమైన సంగీతం చెవులకి ఇంపుగా ఉంటుంది, సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్ గా ఉంటుంది నిర్మాణం విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.
చివరి మాట: తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపు లాగానే ఈ సినిమా కూడా ఎండ్ అవుతుంది ఫస్ట్ అఫ్ సరదాగా సాగితే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. కథ మనం ఎన్నోసార్లు చూసినట్లు అనిపించినా ఎందుకో కాస్త రీఫ్రెషింగా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు అనిపిస్తుంది .
రేటింగ్:3/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి