ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్నా లేకపోయినా సినిమాలను పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. దానితో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఆసక్తి కూడా తగ్గిపోతూ వస్తుంది. కానీ స్టార్ హీరోలు మరియు స్టార్ దర్శకుల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రం ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకుంటున్నారు. అలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన నాలుగు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలలో ఉన్నాయి. ఇప్పటికే అందులోని కొన్ని సినిమాలకు సంబంధించిన మూవీ ల విడుదల తేదీలు వెలుపడ్డాయి. మరికొన్ని సినిమాలు పలానా సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం కల్కి 2898 ఏడి అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: